యుద్ధ కాండ
ఇరువది రెండవ
సర్గ
సముద్రుడు – మెరయుచున్న
పడగలు గల సర్పములను ధరించెను. మేలైన వైఢూర్యం వాలే శ్యామ వర్ణంతో
తెజరిల్లుచుండెను. సముద్ర జలధి నుండే ఉత్పన్నమైన రత్నములచే పొదగబడిన బంగారు
ఆభరణములు, ఎర్రని మాలికలు, పాటలవర్ణ
మణిపూస తో కూడిన ముత్యాల హారములు, వస్త్రములు
ధరించియుండెను . నేత్రములు తామర రేకులు. శిరస్సుపై వివిధములైన పుష్పములతో కూడిన
పూల దండ. చక్కని రూపములతో ఒప్పుచున్న దేవతలా విరాజిల్లెడి గంగ సింధు మున్నగు
నదులతో సమావ్రుత్తుడై ఉండెను.